Friday, July 28, 2023

జులై 30న PSLV-C56 ద్వారా ఏడు ఉపగ్రహాల ప్రయోగం : 15 రోజుల వ్యవధిలో రెండవ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం

 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి, జులై 30 PSLV-C56 ద్వారా DS-SAR ఉపగ్రహన్నిమరియు ఆరు ఇతర ఉపగ్రహాలను ప్రయోగించటానికి భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) అన్నహాలు చేస్తున్నది. చంద్రఫయాన్-3 మిషన్‌ను తర్వాత, కేవలం 15 రోజుల వ్యవధిలో ఇస్రో తన తదుపరి పెద్ద ప్రయోగానికి సిద్ధమవుతోంది. మొదటి దశలో ఘన రాకెట్ స్ట్రాప్-ఆన్ మోటార్లు లేకుండా PSLVని  ప్రయోగిస్తారు.  

ప్రయోగంలో ప్రాథమిక పేలోడ్: DS-SAR ఉపగ్రహం, 360 కిలోల బరువు ఉంటుంది, ఉపగ్రహం సింథటిక్ ఎపర్చరు రాడార్‌ను కలిగి ఉందిసింగపూర్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న DSTA మరియు ST ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడిన 360 కిలోల బరువు ఉన్న DS-SAR ఉపగ్రహన్ని ప్రయోగిస్తారు ఉపగ్రహం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) అభివృద్ధి చేసిన సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR) పేలోడ్‌ను కలిగి ఉంది. అధునాతన సాంకేతికతతో రూపొందించబడిన ఉపగ్రహం, పగలు రాత్రి తేడా లేకుండా వాతావరణాన్ని పరిశీలించే సత్తా కలిగియున్నది. కక్ష్యలో పని చేయటం ప్రారంభంచిన తర్వాత, సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. మరియు ST ఇంజనీరింగ్ యొక్క వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందన చిత్రాలను మరియు జియోస్పేషియల్ సేవలను అందిస్తుంది

DS-SARతో పాటు క్రింద పేర్కొనబడిన ఆరు ఉపగ్రహాలను కూడా  ప్రయోగిస్తారు

1). 23 కిలోల Velox-AM,  మైక్రోసాటిలైట్

2). ప్రయోగాత్మక ఉపగ్రహం ఆర్కేడ్ (Atmospheric Coupling and Dynamics Explorer -ARCADE); 3). టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ పేలోడ్‌తో కూడిన 3U నానోసాటిలైట్ SCOOB-II; 

4). పట్టణ మరియు మారుమూల ప్రాంతాలలో IoT కనెక్టివిటీని ఇవ్వటానికి ఉపయోగపడే న్యూస్పేస్ కు చెందిన

      న్యూలియన్ (NuLIoN);  

5). భూ సమీప  కక్ష్య లోకి పంపబడే  ఒక అధునాతన 3U నానోసాటిలైట్ గలాసియా-2; 

6). అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడిన ఉపగ్రహం ORB-12 స్ట్రైడర్


ప్రయోగం ద్వారా, అంతరిక్ష సాంకేతికతలో భారతదేశం యొక్క సామర్థ్యాలను ఇస్రో మరొకసారి, ప్రదర్శిస్తుందని ఆశిద్దాం.

రెండవ దశ వరకు అనుసంధానం చేయబడిన PSLVని అనుసంధాన భవనం 

నుండి ప్రయోగ వేదికకు రైకు పట్టాలపై తరలిస్తున్న దృశ్యం







Tuesday, July 11, 2023

SSLV రాకెట్ ను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడానికి ఇస్రో నిర్ణయం

జూలై 09, 2023 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రోతన చిన్న రాకెట్‌ (Small Satellite Launch Vehicle - SSLV) సాంకేతికతను వేలం ద్వారా ప్రైవేట్ పరిశ్రమకు బదిలీ చేసేందుకు నిర్ణయించినట్లు, సంస్థకు చెందిన  అధికార వర్గాలు తెలిపాయి.

500 కిలోల బరువున్న ఉపగ్రహాలను వాణిజ్య పరంగా భూ సమీప  కక్ష్యలోకి పంపేందుకై అభివృద్ధి చేసిన చిన్న రాకెట్‌ SSLV ని  ఇస్రో రెండు మార్లు శ్రీహరికోట నుండి ప్రయోగించిన విషయం తెలిసినదేఇస్రో త్వరలో ఉపగ్రహ ప్రయోగ వాహనం యొక్క సాంకేతికతను బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ రంగానికి బదిలీ చేసేందుకు సిద్ధమైతున్నది. "మేము SSLVని పూర్తిగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తాము. కేవలం తయారీ మాత్రమే కాదు, పూర్తి సాంకేతికతను బదిలీ చేస్తాము" అని అధికారి తెలిపారు.




గత ఏడాది ఆగస్టులో SSLV యొక్క తొలి ప్రయోగంలో  రెండవ దశ విడిపోయే సమయంలో  ఎక్విప్‌మెంట్ బే డెక్‌పై కొద్దిసేపు ఏర్పడిన కంపనం కారణంగా విఫలమైంది. లోపం యొక్క లోతైన విశ్లేషణ తర్వాత ఇస్రో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా, సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన SSLV ప్రయోగం విజయవంతమైనది. ప్రయోగంలో EOS-07 ఉపగ్రహాన్ని, అమెరికా సంస్థ అంటారిస్  యొక్క Janus-1 ఉపగ్రహాన్ని, మరియు చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ యొక్క AzaadiSAT-2 ఉపగ్రహాన్ని, 450-కిమీ వృత్తాకార భూ సమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.


SSLV  10 కిలోల నుండి 100 కిలోల బరువున్న అతి సూక్ష్మ మరియు సూక్ష్మ ఉపగ్రహాలను భూ సమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టే లక్ష్యంగా అభివృద్ధి పరచబడిందిచిన్న చిన్న  ఉపగ్రహాలను అభివృద్ధి పరచి, కక్ష్యలోకి పంపే వ్యాపార సంస్థలు రాకెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 'ఆన్-డిమాండ్' ప్రాతిపదికన SSLV ప్రయోగ సేవలు అందుబాటులోకి వస్తాయి


విజయవంతమైన ప్రయోగాలతో నమ్మదగిన రాకెట్ గా పేరు పొందిన పిఎస్‌ఎల్‌వి లను నిర్మించటానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు లార్సెన్ అండ్ టూబ్రోల కన్సార్టియంకు ఇస్రో గత సంవత్సరం కాంట్రాక్టును ఇచ్చింది.


వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ సేవల వలన  మన దేశీయ అంతరిక్ష పరిశ్రమ, 2025 నాటికి $13 బిలియన్లను   ఆదాయాన్ని మన ఆర్ధిక వ్యవస్థకు అందించగలదని, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ మరియు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా తమ సంయుక్త  నివేదికలో  పేర్కొన్నాయి.


శాటిలైట్ లాంచ్ వెహికల్-3 (SLV-3), అడ్వాన్స్‌డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV), పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మరియు  జి.ఎస్ఎల్.వి మార్క్-3 (LVM-3) తరువాత ఇస్రో అభివృద్ధి చేసిన  ఉపగ్రహ వాహక రాకెట్లలో  SSLV ఆరవది.

అయితే   SLV-3 మరియు ASLV ఇప్పుడు వాడుకలో లేవు.


Thursday, July 6, 2023

జులై 14న చంద్రయాన్-3 ప్రయోగానికి సమాయత్తమైన ఇస్రో

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి జూలై 14 మధ్యాహ్నం 2:35 గంటలకు చంద్రయాన్-3 ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో). నేడు చంద్రయాన్-3 వ్యోమనౌకతో  గూడిన ఎల్.వి.ఎం-3 (జి.ఎస్.ఎల్.వి మార్క్ 3) రాకెట్  ను రెండవ ప్రయోగవేదికకు తరలించిన తర్వాత ఇస్రో ప్రకటన చేసింది. ప్రయోగాన్ని  జూలై 13 నిర్వహిస్తామని  ఇస్రో గతంలో చెప్పింది.

రోజున [జూలై 14] ప్రయోగం జరిగితే, ఆగస్టు చివరి వారంలో  చంద్రయాన్-3 చంద్రుడిని చేరుకుంటుంది. ల్యాండింగ్ ఆగస్ట్ 23 లేదా 24 జరుగుతుంది. రెండు తేదీలలో కుదరకపోతే, మరో నెల రోజులు వేచి ఉండి సెప్టెంబర్‌లో దిగుతుందని  ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గురువారం చెప్పారు.


చంద్రయాన్-3 వ్యోమనౌక లో ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్ మరియు రోవర్ అనే మూడు విభాగాలు ఉన్నాయి. చంద్రయాన్-2కి కొనసాగింపు ప్రయోగమైన చంద్రయాన్-3 యాత్రలో  చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా దిగుతుంది. మరియు రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ, మట్టి నమూనాలను సేకరించి పరిశోధనలను చేస్తుంది.  


యాత్రలో, చంద్ర ఉపరితలంపై ఉన్న  రాళ్ళు, ధూళితో కూడిన మట్టి (దాన్ని మూన్ రెగోలిత్ అని అంటారు) యొక్క ప్లాస్మా పర్యావరణం మరియు మూలక కూర్పుల ఉష్ణ-భౌతిక (థెర్మో ఫిజికల్) లక్షణాలనుమరియూ చంద్ర భూకంపాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన శాస్త్రీయ ఉపకరణాలను (పరికరాలు) చంద్రయాన్-3 తీసుకువెళుతుంది. భూమి యొక్క స్పెక్ట్రో-పోలరిమెట్రిక్ సిగ్నేచర్లను చంద్ర కక్ష్య నుండి అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాత్మక పరికరం - స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్  ఉపకరణాన్ని ప్రొపల్షన్ మాడ్యూల్లో అమరుస్తారు ఉపకరణం ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు 100 కి.మీ చంద్ర కక్ష్యలో  పరిభ్రమిస్తూ  అధ్యయనం చేస్తుంది





చంద్రయాన్ -3 లోని సాంకేతిక ఉపకరణాలు :


- ల్యాండర్ లో అమర్చే ఉపకరణాలు : ఉష్ణ వాహకత మరియు ఉష్ణోగ్రతను కొలవడానికి 'చంద్ర ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం'; ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంపాన్ని కొలవడానికి 'చంద్ర భూకంప చర్య కోసం పరికరం'; మరియు ప్లాస్మా సాంద్రత మరియు దాని వైవిధ్యాలను అంచనా వేయడానికిగాను 'లాంగ్‌ముయిర్ ప్రోబ్'.  మరియూ, చంద్ర లేజర్ శ్రేణి అధ్యయనాల కోసం నాసా ( అమెరిక యొక్క స్పేస్ ఏజెన్సీ) యొక్క  పాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే ఉపకరణాన్ని  చంద్రయాన్-3 లో అమర్చుతారు


- రోవర్ లో అమర్చే ఉపకరణాలు : ల్యాండింగ్ సైట్ సమీపంలోని మూలక కూర్పును పొందడం కోసం 'ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్' మరియు 'లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ'


ఎల్.వి.ఎం-3 ఆఖరి దశ చంద్రయాన్-3ని సుమారు 170 x 36,500 కి.మీ ఎలిప్టిక్ పార్కింగ్ కక్ష్యలో ఉంచుతుంది. ల్యాండర్/రోవర్ను ప్రొపల్షన్ మాడ్యూల్ ను 100 కి.మీ వృత్తాకార ధ్రువ చంద్ర కక్ష్యలోకి తీసుకువచ్చి వేరు చేస్తుంది. ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో 69.37 S, 32.35 E సమీపంలో చంద్రుని ఉపరితలంపై రోవర్‌తో కుదుపులు లేకుండా దిగుతుంది. టచ్‌డౌన్ వేగం 2 m/s నిలువుగా మరియు 0.5 m/s క్షితిజ సమాంతరంగా ఉండేలా ప్రణాళిక చేయబడింది. రోవర్‌ను మోహరించగలదు. రోవర్  ప్రాంతంలో సంచరించే   సమయంలో చంద్రుని ఉపరితలంపై రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది. భూమితో కమ్యూనికేషన్‌లను ప్రారంభించడానికి ప్రొపల్షన్ మాడ్యూల్ / కమ్యూనికేషన్స్ రిలే కొరకు చంద్ర కక్ష్యలోనే ఉంటుంది.


సెప్టెంబరు 2019లో చంద్రునిపై చంద్రయాన్-2 ల్యాండర్ 'విక్రమ్'‌ సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంలో విఫలమైనందునచంద్రయాన్-3 ల్యాండర్‌ రూపకల్పనలో  మెరుగుపరిచిన నూతన సాంకేతికతలను ఉపయోగించింది. సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం; చంద్రునిపై రోవర్ పర్యటనను ప్రదర్శించడం మరియు అక్కడి పరిస్థితులలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం వంటి  చంద్రయాన్-3 యాత్ర  లక్ష్యాలను సాధించటంలో  ఇస్రో ఘన విజయం సాధించాలని  కోరుకుందాం.